బతుకమ్మ, నిజామాబాద్ క్రైం: యుపిఐ ద్వార జరిగే చెల్లింపులు చేసినట్లే చేసి డబ్బులు చెల్లించకుండా మొసం చేస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పలు మొబైల్ షాప్ లలో షేక్ అమర్ అను యువకుడు మొబైల్ ఫోన్స్ ను కొనుగోలు చేసి వాటికి సంబంధిత డబ్బులను ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఫేక్ యూపీఐ లావాదేవిలు జరిపి వారిని మోసం చేసినాడని తెలిపారు. సంబందిత సెల్ పోన్ లు మొత్తం విలువ సుమారు రూ:57,000 ఉంటుందని అంచనా బాదిత సెల్ పోన్ షాపుల యజామానుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అమర్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. యూపీఐ (ఫోన్ పే గూగుల్ పే ) లావాదేవీ ల యందు జాగ్రత్తలు వహించాలని, అనుమానస్పధ లావాదేవిల మీదా పిర్యాదుల చేయాలని ఎస్ హెచ్ఓ కొరారు.






