బతుకమ్మ, నిజామాబాద్ సిటి : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ జీవితంపై విరక్తి చెందిన బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం న్యాల్ కల్ రోడ్డుకు చెందిన పూదారి లింగమని (65)కు గత మూడు సంవత్సరాల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త మరణంతో మనస్తాపం చెందిన లింగమని అనారోగ్యం భారిన పడినట్లు కుటుంబీకులు తెలిపారన్నారు. మానసికంగా ఆలోచిస్తూ లింగమని జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంట్లోని బాత్రూంలో ఇనుప పైపుకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. గమనించిన కూతురు 108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిన వైద్యులు తెలిపారన్నారు. మృతురాలికి ముగ్గురు ఆడపిల్లలు అని వారికి పెళ్లిళ్లు అయినట్లు తెలిపారు. పెద్ద కూతురు పూదరి ప్రశాంతి ఫిర్యాదు మేరకు 4వ టౌన్ ఎస్సై ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసి, లింగమని మ`తదేహాన్నిపోస్ట్ మార్టంకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.






