- ముదిరాజ్ ల ప్రాతినిద్యం జనాభా దామాషా ప్రకారం ఉండాలి
- అఖిల భారత ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్
బతుకమ్మ, నిజామాబాద్ : రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిల భారత ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు. సబ్బండ వర్గాలు అన్ని ఏకతాటిపైకి రాయాల్సిన సమయం ఆసన్నమైందని అందులో ముదిరాజ్ లు ముందు ఉండాలని సూచించారు .నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ల సమావేశంలో అఖిల భారత ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతు….చట్ట సభల్లో సబ్బండ వర్గాల బలం పెరగాల్సిన అవసరం ఉందని అందులో ముదిరాజ్ ల ప్రాతినిద్యం జనాభా దామాషా ప్రకారం ఉండాలన్నారు. బీసీ ల్లో అత్యధిక శాతం జనాభా ఉన్న ముదిరాజ్ లకు సరైన న్యాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యారని ఆయన మండి పడ్డారు. ముదిరాజ్ లను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకుంటున్నారని..ఈ పద్ధతి మారాలని ఆయన ఆకాక్షించారు. ప్రతి గ్రామం నుండి 10మంది ముదిరాజ్ యువకులు నాతో పాటు ముందుకు వస్తే ముదిరాజ్ జాతిని మరింత బలోపేతం చేస్తాం అన్నారు..ఇక ఓటర్ ఐడి కార్డులో ప్రతి ఒక్క ముదిరాజ్ తమ తమ పేర్ల చివరన ముదిరాజ్ అని పెట్టుకోవాలని ఈ ఆప్షన్ ఉందని ఆయన తెలిపారు.ఇక ముదిరాజ్ లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కారణం సరైన విద్యాఉపాధి అవకాశాలు లేకపోవడమే అన్నారు. ప్రతి ఇంటి ఒక్కరూ ముందుకు వస్తె బీసీల రాజ్యాధికారం రావడం ఖాయం అన్నారు. చట్ట సభల్లో బీసీలకు సముచిత స్థానం కోసం చేసే పోరాటంలో ముదిరాజ్ లు ముందు ఉండాలని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులతో పాటు… నిజామాబాద్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కరాటే రమేష్ ముదిరాజ్రాష్ట్ర జనరల్ సెక్రటరీ డా.జగదీష్ ప్రసాద్మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పుట్టి రాజు ముదిరాజ్రాష్ట్ర ముదిరాజ్ నాయకులు డా .వినోద్ ఇతర ముదిరాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు






