బతుకమ్మ, మాచారెడ్డి: మండలంలోని లచ్చపేటప్రాథమిక పాఠశాల శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉట్టికొట్టే కార్యక్రమం అందరిని అలరించింది. గోపికల వేషాధారణలో అమ్మాయిలు, కృష్ణుల వేషధారణ లో అబ్బాయిలు ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టిన విద్యార్ధి అజమతుల్లాకు రూ.501 బహుకరించిన గ్రామస్తుడు మంద అంజయ్య ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్ వాడి టీచర్లు, ఆయాలు తదితరు పాల్గొన్నారు.






