బతుకమ్మ మోర్తాడ్: ఆగస్టు 16: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల గురించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన అనుచిత వాక్యాలకు తెలంగాణ రాష్ట్ర మహిళా సమాజానికి క్షేమాపణలు చెప్పాలని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముత్యాల రాములు డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం మోర్తాడ్ మండలం బస్టాండ్ చౌరస్తాలో కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళా సంఘాలను బలోపేత చేయడానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలను అభివృద్ధి పథంలో నడిపించడానికి కాంగ్రెస్ చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకనే కేటీఆర్ ఇలాంటి వాక్యాలు చేయడం సరికాదని వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాలని కోరారు. కార్యక్రమంలో గిర్మాజి గోపి, లక్మ రంజిత్, అర్గుల రమేష్, మైపాల్, ఆనంద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు






