బతుకమ్మ, మోర్తాడ్: చేతికొచ్చిన పంటను చూస్తూ రైతు కళ్ళల్లో ఆనందం కలిగింది.కానీ ప్రకృతి ఒక్కసారిగా ఆశలని అడి ఆశలు చేస్తూ పంటను నేలపాలు చేసింది. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో గాలి వానకు ఏలేటి చిన్న రాజన్న అనే రైతుకు సంబంధించిన చేతికొచ్చిన మొక్కజొన్న పంట సుమారు రెండు ఎకరాల వరకు నేలకొరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతు దుఃఖ. క్రాoతులయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షం తాకిడికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.






