- ఒకరి దుర్మరణం
- ఐదుగురికి గాయాలు
బతుకమ్మ, నవీపేట్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అబ్బపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. భైంసా కు చెందిన స్నేహితులు బోధన్ వస్తుండగా ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న కారు నవిపేట్ మండలం అబ్బపూర్ వద్ద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. భైంసా కు చెందిన ఎంఐఎం నాయకుడికి సంబంధించిన వారు యాక్సిడెంట్ లో గాయాలు కావడంతో నిజామాబాద్ కు చెందిన ఎంఐఎం నాయకులు అక్కడికి చేరుకొని వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. మృతి చెందిన యువకుడిని పైసల్ (24) గా గుర్తించారు.






